‘శివన్’ టీజర్ కు సూపర్ రెస్పాన్స్!!

కల్వకోట సాయితేజ-తరుణీసింగ్ జంటగా ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి శివన్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. యువ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఈనెల 25న విడుదలైంది. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన 24 గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న ఈ చిత్రం అదే దూకుడుతో మిలియన్ వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “మేము కనీసం రెండు మూడు లక్షల మందికయినా చేరువ అయితే చాలనుకున్నాం. కానీ ఇప్పటికే 10 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవలకాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్ గా నిలిచిన చిత్రాల జాబితాలో మా “శివన్” కూడా కచ్చితంగా స్థానం పొందుతుంది” అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus