Testy Teja: బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ ప్రవర్తన పై విమర్శలు..ఏమైందంటే..!

‘బిగ్‌బాస్ 7 ‘ లో కామన్ మెన్ గా ఎంట్రీ ఇచ్చాడు టేస్టీ తేజ…!బిగ్ బాస్ కి ముందు ఇతను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసేవాడు. దీంతో మొదట్లో ఇతనిపై ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. ఆ సానుభూతి వల్లే ఇతను గేమ్ పెద్దగా ఆడకపోయినా … 9 వారాల పాటు, అంటే దాదాపు రెండు నెలల పాటు హౌస్లో కొనసాగాడు. గతవారమే ఇతను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఈ రకంగా చూస్తే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో అనేది టేస్టీ తేజకి అడ్వాంటేజ్ అవ్వాలి.

కానీ ఇప్పుడు అతని పై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కసారిగా మీడియాలో కూడా బ్యాడ్ అయిపోయాడు తేజ. అంతలా ఏం జరిగింది అంటే.. హౌస్ లో ఇతను అమ్మాయిలతో కలిపే పులిహోర మామూలుగా ఉండదు. శోభా శెట్టి పై చీటికీ మాటికీ చేతులు వేయడం, ఐ లవ్ యు వంటివి చెప్పడం, అలాగే శుభ శ్రీ థైస్ పై చేతులు వేసి ఫ్లర్ట్ చేయడం వంటివి.. జనాలకి నచ్చలేదు. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జునతో ఎక్కువగా తిట్లు తిన్నది టేస్టీ తేజనే అనడంలో అతిశయోక్తి లేదు.

అది పక్కన పెడితే.. హౌస్ లో నుండి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి చూసి తేజ షాకైనట్టు ఉన్నాడు. రెండు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాక ఇతని పై పూర్తిగా నెగిటివిటీ ఉందని అతనికి అర్ధమైపోయింది. దీంతో హౌస్లోకి వెళ్లే ముందు.. పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తాను అంటూ ప్రామిస్..లు చేసిన తేజ.. ఇప్పుడు వారికి మొహం చాటేస్తున్నాడట. అక్కడితో ఆపేస్తే పర్వాలేదు.. ఇంటర్వ్యూ అంటూ అతని ఇంటికి వెళ్లిన వారితో దురుసుగా ప్రవర్తిస్తూ నోరు పారేసుకున్నాడట.

కొన్ని ఛానల్స్ వారు అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు తేజ ఇంటి వద్దనే ఇంటర్వ్యూ కోసం ఆశగా ఎదురు చూశారట. నైట్ 11 అవ్వడంతో ఎలక్షన్ కోడ్ వల్ల పోలీసులు వచ్చి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారిపై లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకే ‘బిగ్ బాస్ కంటెస్టెంటు అనుకుంటున్నావా? లేక ఆస్కార్ అవార్డు గ్రహీత అనుకుంటున్నావా?’ అంటూ (Testy Teja) తేజ పై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus