తాప్సిపై కోపంగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు
- July 11, 2017 / 11:22 AM ISTByFilmy Focus
ఢిల్లీ భామ తాప్సికి తెలుగు చిత్ర పరిశ్రమ హీరోయిన్ గా అవకాశం ఇచ్చింది. ఝుమ్మంది నాదం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ భామ తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లో అనేక చిత్రాలు చేసింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. సో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన పింక్ చిత్రం తాప్సి కెరీర్ ని మలుపు తిప్పింది. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు హిందీ సినిమాలున్నాయి. ఈ విజయ గర్వంతో తాప్సి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని విమర్శించింది. “వందకు పైగా సినిమాలు చేసిన రాఘవేంద్రరావు హీరోయిన్ ల బొడ్డు మీద పువ్వులు, పండ్లు వేయడం ఏంటో ? నాకు ఇప్పటికీ అర్థం కాలేదని, అలా వేస్తేనే హీరోయిన్ల అందాలు బయట పడతాయా?” అని ఓ ఇంటర్వ్యూ లో హేళన చేసింది.
ఎంతోమంది నటీనటులకు లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావును విమర్శించడంతో సినీపెద్దలు ఆగ్రహించారు. తాప్సి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భామని తెలుగులో నటించకుండా నిషేధం విధించేందుకు చర్చలు సాగుతున్నాయి. టాలీవుడ్ లోని ప్రముఖులు ఈ విషయంపై త్వరలో ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













