Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

  • October 13, 2022 / 08:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు. ‘ఆచార్య’ మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. ‘ఆచార్య’ పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం ‘లూసిఫర్’ మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ ‘లూసిఫర్’ లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.

ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ‘గాడ్ ఫాదర్’ లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే… సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #tfja

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

8 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

9 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

1 day ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

2 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

3 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

4 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

5 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version