తిలక్ రాజ్, తుంగ హీరో హీరోయిన్లుగా దేవరాజ్ ముఖ్యపాత్రలో రూపొందిన చిత్రం ‘తాళికట్టు శుభవేళ’.’శ్రీ వెంకటా చలపతి ఫిలింస్’ బ్యానర్ పై బి.అరుణ్ కౌశిక్ ఈ చిత్రాన్ని నిర్మించగా వి. జగన్నాధరావ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుక తాజాగా హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధిలుగా సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల, నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ, నటి అలాగే ప్రాముఖ్య యాంకర్ అయినటువంటి స్వప్న చౌదరి అమ్మినేని, సంగీత దర్శకుడు వి.ఆర్.ఎ. ప్రదీప్, గాయని ఏజే సంధ్యావర్షిణి, సినీ దర్శకుడు ప్రణయ్ రాజ్ వంగరి వంటి వారు విచ్చేశారు.
ఈ సందర్భంగా, సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..” ‘తాళికట్టు శుభవేళ’ సినిమా టైటిల్ లోనే చాలా పాజిటివిటీ ఉంది. సంగీతం పరంగా కూడా మధురంగా అనిపిస్తుంది. నేటి తరానికి విలువలు నేర్పించే మంచి కథ ఈ సినిమాలో ఉందనిపిస్తుంది. నిర్మాత అరుణ్ కౌశిక్, రచయిత-నిర్మాత చలపతిగారు, మొత్తం యూనిట్‌కు నా బెస్ట్ విషెస్ తెలుపుకుంటున్నాను” అని తెలిపారు.
నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త మాట్లాడుతూ – “ఈ సినిమాలోని పాటలు విన్నప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ గుర్తుకొచ్చాయి. ఇలాంటి కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ – “యాక్టర్స్ పెర్ఫార్మన్స్ సహజంగా ఉన్నాయనిపిస్తుంది. ట్రైలర్, పాటలు చూశాక ఈ సినిమాలో మంచి సోల్ ఉంది అనే నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది” అని తెలిపారు.
నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. “తాళికట్టు శుభవేళలో మంచి ఎమోషన్, సోల్ ఉన్నాయనిపిస్తోంది. ఈ తరహా కథలు అరుదుగా వస్తాయి. నిర్మాత, దర్శకుడు బాగా కష్టపడ్డారు. తప్పకుండా వారికి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నాను” అంటూ అన్నారు.
రచయిత, నిర్మాత బి. చలపతి మాట్లాడుతూ – “మా ‘తాళికట్టు శుభవేళ’ యూనిట్ చాలా శ్రద్ధ పెట్టి ఈ సినిమా రూపొందించింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్స్, మధురమైన పాటలు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని నమ్ముతున్నాను.
‘తాళికట్టు శుభవేళ’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.