Vijay: ముందు ఆ వీడియో డిలీట్ చెయ్యి… నటి పై మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్!

సాధారణంగా స్టార్ సెలబ్రిటీలకు పుట్టినరోజులు కనుక వస్తే ఇతర సెలబ్రిటీలు వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణం అలాగే అభిమానులు కూడా పెద్ద ఎత్తున తమ అభిమాన హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ తలపతి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ నటి సనమ్ శెట్టి వినూత్న రీతిలో హీరో విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈమె చాలా కష్టపడి విజయ్ (Vijay) చిత్రపటాన్ని గీసి సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా నటి విజయ్ కి చాలా స్పెషల్ గా విషెస్ చెప్పడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియో చూసినటువంటి విజయ్ అభిమానులు ఒక్కసారిగా నటి సనమ్ శెట్టిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో పై స్పందించిన విజయ్ ఫ్యాన్స్ మా హీరో బొమ్మను ఇంత చండాలంగా గీస్తావా అంటూ మండిపడుతున్నారు.

నువ్వు గీసిన ఆ బొమ్మకు విజయ్ కి ఒక్క పోలికైనా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ముందు ఆ వీడియో డిలీట్ చేసి నువ్వు బొమ్మలు వేయడం మానుకో అంటూ ఈమెకు సలహాలు ఇస్తున్నారు. ఇలా విజయ్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. సనమ్‌ శెట్టి అంబులి అనే తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. శ్రీమంతుడు సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సింగమ్‌ 124, ప్రేమికుడు అనే సినిమాలలో నటించారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus