Vijay: విజయ్ సినిమాకి ప్రభాస్.. ప్రభాస్ సినిమాకి విజయ్!

Ad not loaded.

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతిని (Vijay) తెలుగు ట్విట్టర్ యువత బోర్ కొట్టినప్పుడల్లా ట్రోల్ చేస్తుంటారు. అందుకు కారణం విజయ్  ఫ్యాన్స్ అనే చెప్పాలి, ఒక్కడు కంటే దాని తమిళ రీమేక్ గిల్లీ బెటర్ అంటూ వాళ్లు చేసే కామెంట్సే అందుకు కారణం. అయితే.. విజయ్ తాజా చిత్రం “గోట్” ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలో కీలకపాత్ర పోషించిన వైభవ్ రెడ్డి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “హైద్రాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ్ హైద్రాబాద్ లోని గోకుల్ థియేటర్లో “సలార్” సినిమా చూశారని చెప్పడం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Vijay

అదే సందర్భంలో.. విజయ్ గోకుల్ థియేటర్లో “సలార్” (Salaar) చూస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. స్టార్ హీరోలు ఇలా వేరే హీరోల సినిమాలు థియేటర్లో చూడడం అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. తమిళ స్టార్ హీరో అయిన విజయ్ ఇలా ప్రభాస్ (Prabhas) సినిమా చూడడం అనేది చర్చనీయాంశం అయ్యింది.

ఇకపోతే.. ప్రభాస్ కూడా ఒకప్పుడు విజయ్ “తుపాకీ” చిత్రాన్ని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూశాను అని చెప్పిన విషయం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సంఘటనతో.. ఒక్కసారిగా విజయ్ & ప్రభాస్ ముట్యుయల్ ఫ్యాన్స్ పెరిగిపోయారు.

ఇకనైనా ట్విట్టర్లో విజయ్ ను తెలుగు యువత ట్రోల్ చేయడం ఆపితే బాగుండు. పాపం సందర్భంతో సంబంధం లేకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా విజయ్ ఒకడు దొరికేసేవాడు ట్రోల్ చేయడానికి. ఇకపోతే.. విజయ్ తాజా చిత్రం “గోట్” తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆఖరి చిత్రంగా పేర్కొంటున్న ఈ సినిమా ఆయనకు హిట్ కట్టబెడుతుందో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతారు అనేది తమిళనాడు వర్గాల టాక్!

Salaar Dialogues: ‘సలార్’ సినిమాలో ఆకట్టుకునే 25 డైలాగులు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus