Thaman: మహేష్ త్రివిక్రమ్ మూవీ అలాంటి కథతోనా..?

కెరీర్ తొలినాళ్లలో వేగంగా ఆఫర్లను అందిపుచ్చుకున్న థమన్ కు తరువాత కాలంలో వరుస షాకులు తగిలాయి. రొటీన్ మ్యూజిక్ అందిస్తున్నాడనే విమర్శలు వ్యక్తం కావడంతో కొన్నేళ్లు థమన్ కు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే వరుణ్ తేజ్ తొలిప్రేమ, అరవింద సమేత వీరరాఘవ సినిమాలతో తనపై వ్యక్తమైన విమర్శలకు థమన్ చెక్ పెట్టారు. సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇస్తూ థమన్ సత్తా చాటుతున్నారు. మహేష్ త్రివిక్రమ్ సినిమాకు సంగీత దర్శకునిగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా థమన్ ఫైనలైజ్ అయ్యారని సమాచారం.

థమన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ త్రివిక్రమ్ సినిమాకు తానే మ్యూజిక్ డైరెక్టర్ గా చేయనున్నానని చెప్పారు. ఇప్పటికే మహేష్ సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మహేష్ తరువాత సినిమాకు కూడా తన టాలెంట్ తో థమన్ ఛాన్స్ కొట్టేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ సినిమాల జానర్లకు సంబంధించిన సీక్రెట్లను థమన్ రివీల్ చేయడం గమనార్హం. మహేష్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పూర్తిస్థాయి మాస్ సినిమా అని థమన్ చెప్పారు. అయితే ఈ సినిమాలో వినోదానికి ఢోకా ఉండదని థమన్ అన్నారు.

మహేష్ త్రివిక్రమ్ సినిమా కొత్త జానర్ లో తెరకెక్కనుందని థమన్ వెల్లడించారు. అతడు మూవీ కంటే ఈ మూవీ గొప్పగా ఉంటుందని థమన్ చెప్పుకొచ్చారు. థమన్ మహేష్ రెండు సినిమాల జానర్ల గురించి చెప్పి ఆ సినిమాలపై భారీగా అంచనాలను పెంచేశారని చెప్పాలి. గతంలో మహేష్ త్రివిక్రమ్ సినిమాలో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటించనున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్త నిజమేనని మహేష్ ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus