Thaman: బాలయ్య అభిమానులకు థమన్ చెప్పిన అదిరిపోయే తీపికబురు ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ (Thaman) ఒకరు కాగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో థమన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. థమన్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తాను మ్యూజిక్ అందిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు. బాలయ్య (Balakrishna) అభిమానులకు థమన్ అదిరిపోయే తీపికబురు చెప్పగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య థమన్ కెరీర్ లో అఖండ సినిమా ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.

అఖండ (Akhanda) సినిమా బీజీఎంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ లవర్స్ అఖండ మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అఖండ సినిమా ఓఎస్టీ రిలీజ్ కానుందని ఆయన ప్రకటన చేశారు. థమన్ సంచలన ప్రకటన బాలయ్య అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అతి త్వరలోనే ఈ సౌండ్ ట్రాక్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య సినిమాలకు వరుసగా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న థమన్ అఖండ సీక్వెల్ కు సైతం మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయి. అఖండ సీక్వెల్ కు సంబంధించి త్వరలో ఆసక్తికర అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. బోయపాటి శ్రీను (Boyapati Srinu)  ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. బాలయ్యతో సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే బోయపాటి శ్రీనుకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అఖండ2 సినిమా బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా కోసం విదేశీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus