Thaman: విజయ్ ‘వారిసు’ హిట్ అయితే థమన్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడంటే..!

ఇళయ దళపతి విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మించిన ద్విభాషా చిత్రం ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 14న విడుదల కానుండగా.. తమిళ నాట నేడు (జనవరి 11)న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదలైైంది. రష్మిక మందన్న హీరోయిన్ కాగా ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా సంగీత దర్శకుడు థమన్ ‘వారిసు’ సినిమా చూసి ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..వివరాల్లోకి వెళ్తే.. ‘వారిసు’ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ అదరగొట్టేశాడు. ‘రంజితమే, దళపతి ’సాంగ్స్‌తో పాటు మిగిలిన పాటలు కూడా ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా థమన్ బాబుని మెచ్చుకుంటున్నారు. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా విజయ్‌కి పెద్ద ఫ్యాన్స్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు థమన్. ఏదో అనుకోకుండా ఎమోషనల్ అయ్యాడులే అనుకున్నారంతా..

కట్ చేస్తే.. థమన్‌కి విజయ్ సినిమా నిజంగానే చాలా ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా థమన్ ఓ ట్వీట్ వేశాడు. ‘‘విజయ్ అన్నా.. సినిమాలోని ఎమోషన్స్ సీన్స్ చూసి ఏడ్చేశాను. కన్నీరు విలువైంది. ‘వారిసు’ సినిమా నా హృదయాన్ని హత్తుకుంది. ఇంత పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. లవ్యూ అన్నా’’ అంటూ విజయ్‌తో తీసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇక అందరి మధ్య థియేటర్లలో మరోసారి ‘వారిసు’ చూసిన కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

పక్కనే డైరెక్టర్ వంశీ పైడపల్లి, దిల్ రాజు ఉన్నాసరే ఏడుస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తమిళనాట ‘వారిసు’ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో విజయ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జనవరిన తెలుగులోనూ భారీ స్థాయిలో ‘వారసుడు’ విడుదల కానుంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus