Thaman: ఓజీ రిజల్ట్ పై థమన్ కామెంట్స్ వైరల్.. నమ్మకం నిజమవుతుందా?

2025 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో ఓజీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సుజీత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా సాహో తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాత కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.

Thaman

ఓజీ మూవీ ఇండస్ట్రీ హిట్ కావడం పక్కా అని రాసిపెట్టుకోండంటూ థమన్ కామెంట్లు చేశారు. పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం ఓజీ సినిమా ఎప్పుడు థియేటర్లలో రిలీజవుతుందనే ఆసక్తిని కలిగి ఉన్నారని థమన్ పేర్కొన్నారు. డైరెక్టర్ సుజీత్ ఓజీ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు చేశారు.

త్వరలో ఓజీ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వస్తుందని థమన్ తెలిపారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా పవన్ 15 నుంచి 20 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఓజీ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఓజీ టాలీవుడ్ రేంజ్ ను పెంచే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఓజీ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతూ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు. ఓజీ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుజీత్ ఎంతో వర్క్ చేశారని భోగట్టా. ఓజీ సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

‘శ్వాగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus