టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ఈ మధ్య కాలంలో మళ్లీ కాపీ విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన ట్యూన్లను తానే కాపీ కొడతాడని థమన్ కు పేరుంది. కెరీర్ తొలినాళ్లలో ఈ విమర్శలను ఎక్కువగా ఎదుర్కొన్న థమన్ సర్కారు వారి పాట సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటలో చరణాలను, మమ మహేషా సాంగ్ ను థమన్ కాపీ కొట్టారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
కళావతి పాట చరణాల గురించి థమన్ స్పందిస్తూ తాను ఏదైనా పాటను కాపీ కొట్టినట్టు అనిపిస్తే అందరికంటే ముందుగా తన బృందం రెస్పాండ్ అవుతుందని థమన్ కామెంట్లు చేశారు. నాకు 14 మంది సభ్యుల బృందం ఉందని కాపీ కొడితే చెప్పేసే మంచి యాప్స్ కూడా మా దగ్గర ఉన్నాయని థమన్ అన్నారు. కాపీ కొడుతున్నామనే భావనతో మేము పని చేయలేదని థమన్ కామెంట్లు చేశారు. మేమంతా ఫ్రెష్ గానే వర్క్ ను మొదలుపెట్టామని ఆయన తెలిపారు.
నా ట్యూన్ ను నేను రిపీట్ చేశాననే విషయం జనం చెబితే తప్ప తనకు తెలియలేదని ఆయన చెప్పుకొచ్చారు. కంపోజ్ చేసే టైమ్ లో ఫ్లోలో వెళ్లిపోయామని కాపీ కొడుతున్నామని మాకు తెలియలేదని ఆయన కామెంట్లు చేశారు. నా ట్యూన్ ను నేనే కాపీ కొట్టానని చెబుతున్నారని ఈ కామెంట్ల విషయంలో తాను అస్సలు ఇబ్బంది పడటం లేదని థమన్ వెల్లడించారు. మ మ మహేషా సాంగ్ విమర్శలపై మాత్రం థమన్ స్పందించలేదు.
కాపీ కామెంట్లపై థమన్ స్పందన విన్న నెటిజన్లు షాకవుతున్నారు. థమన్ భలే వెరైటీగా కామెంట్లు చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం థమన్ చేతినిండా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. చిన్న సినిమాల కంటే పెద్ద సినిమాలకే థమన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!