మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. నిర్మాత రామ్ చరణ్ తేజ్ దగ్గరుండి అన్ని పనులను చూసుకుంటున్నారు. సినిమా ప్రకటనకు ముందే నిర్మాత, దర్శకుడు.. చిత్రానికి అవసరమైన సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక పూర్తి చేశారు. అప్పుడు సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని అనుకున్నారు. కానీ అతనికి ఇతర సినిమాల పనుల ఒత్తిడి కారణంగా బయటికి వెళ్లిపోయారు. ఆ స్థానంలో ఎస్.ఎస్.థమన్ ని తీసుకున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై థమన్ సోషల్ మీడియా వేదికపై స్పందించారు. “నాకు సైరా మేకర్స్ నుండి పిలుపు రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా చెబుతాను.” అని స్పష్టం చేశారు.
దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అలాగే థమన్ సైరా కి స్వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. “సైరా” మోషన్ పోస్టర్‌కి థమన్ సంగీతం అందించారు. ఆ సంగీతం అందరితో ప్రశంసలు అందుకుంది. కాబట్టి చిరు థమన్ కే అవకాశం ఇస్తారని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారు. హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన 1840 ల నాటి సెట్ లో తొలి షెడ్యూల్ మొదలు కానుంది. యువ డైరక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నయన తార, మరికొన్ని కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి నటించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ నాలుగు భాషల్లో రిలీజ్ చేయాలని నిర్మాత అనుకుంటున్నారు.