Thandel: తండేల్ సౌండ్ తో కొత్త సినిమాలకు షాక్!

Ad not loaded.

నాగ చైతన్య (Naga Chaitanya)  తండేల్  (Thandel) మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫస్ట్ డే నుంచే సాలిడ్ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమా, వారం గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. పెద్ద సినిమాల జోరు లేదనుకుంటే, వాలెంటైన్స్ వీకెండ్‌తో పాటు కొత్తగా విడుదలైన సినిమాలు పోటీగా వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా, వీటిలో ఏ సినిమా కూడా తండేల్ విజయ యాత్రను ఆపలేకపోయింది. కొత్త సినిమాలైన లైలా, బ్రహ్మానందం వంటి సినిమాలు బాక్సాఫీస్ ఫలితాల్లో తండేల్ కు పోటీ ఇవ్వలేకపోయాయి.

Thandel

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, కొత్త సినిమాలు ఏడు వేల రేంజ్ టిక్కెట్లు మాత్రమే అమ్ముకోగలిగాయి. కానీ అదే సమయంలో తండేల్ మాత్రం రోజుకు 50వేలకుపైగా టిక్కెట్లను విక్రయిస్తూ తన దూకుడు కొనసాగించింది. ఈ సినిమా వసూళ్ల పెరుగుదలను పరిశీలిస్తే, థియేటర్లలో ఇప్పటికీ మంచి హౌస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. వారం గడిచిన తర్వాత కూడా మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తూ, స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది.

ముఖ్యంగా బుజ్జి తల్లి పాట వైరల్ కావడంతో, యూత్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అదనంగా, నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi)  జంటపై ఉన్న క్రేజ్, చందు మొండేటి (Chandoo Mondeti) టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా తండేల్ తన స్టడీ రన్‌ను కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ లెక్క 100 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

ఇక మిగతా కొత్త సినిమాలు, రీ-రిలీజ్ మూవీస్ ఆశించిన స్థాయిలో రన్ ఇవ్వలేకపోతున్నా, తండేల్ మాత్రం యూత్, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతూ అద్భుతమైన బాక్సాఫీస్ హవా కొనసాగిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, టాలీవుడ్‌లో మరో ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం.. ఆ 25 కోట్లు మరో బోనస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus