Thandel: తండేల్ కోసం బన్నీ.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ (Thandel) సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. శ్రీకాకుళం మత్స్యకారుల కథ ఆధారంగా చందూ మొండేటి  (Chandoo Mondeti) తెరకెక్కించిన ఈ మూవీ, ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే చెన్నై, ముంబై లాంటి ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్, హైదరాబాద్‌లో తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రంగం సిద్ధం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Thandel

తండేల్ రాజు కోసం పుష్ప రాజ్ వస్తున్నాడు అంటూ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి పబ్లిక్ ఈవెంట్ కావడంతో, అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఫ్యాన్స్ కు మాత్రం ఎంట్రీ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈవెంట్ పూర్తిగా ఇండోర్‌నే జరపాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

దీంతో అభిమానులకు ప్రత్యక్ష ఎంట్రీ లేకుండా, సినిమా యూనిట్ సభ్యులు, మ్యూజిక్ టీమ్, కొందరు ప్రముఖులు మాత్రమే ఈ ఫంక్షన్‌లో పాల్గొననున్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. ఫ్యాన్స్ అయితే ఈవెంట్‌కి హాజరుకావాలనే ఆశతో ఎదురుచూస్తుండగా, చివరి నిమిషంలో ఇలా జరగడం నిరాశపరిచేలా ఉంది. అయితే ఈ ఈవెంట్‌లో బన్నీ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పుష్ప-2 (Pushpa 2: The Rule) సినిమా కోసం గడ్డం పెంచిన బన్నీ, తాజాగా ట్రిమ్ చేసుకొని స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తండేల్ మూవీ విషయానికి వస్తే, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రిలీజ్‌కు ముందు నుంచే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈవెంట్ ఫ్యాన్స్‌తో జరగకపోయినా, లైవ్ ప్రసారం ద్వారా ప్రేక్షకులకు కనెక్ట్ చేయనున్నట్లు సమాచారం. మరి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus