విక్రమ్ (Vikram) కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శివపుత్రుడు’ ‘అపరిచితుడు’ ‘ఐ’ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తాడు విక్రమ్.అతని లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’ కి కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు.ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘తంగలాన్’ (Thangalaan) మూవీ. ‘మైత్రి’ సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది. టీజర్, ట్రైలర్.. సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి.
మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తున్నాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.92 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్ర | 0.78 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.88 cr |
‘తంగలాన్’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ సినిమా రూ.1.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వర్కింగ్ డే అయినప్పటికీ రెండో రోజు తంగలాన్ బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. శని, ఆది వారాలు సెలవులు ఉండటం.. సోమవారం కూడా కొంతమందికి సెలవు ఉండటం.. నిలకడగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.