ఒకవైపు యాంకర్ గా మరోవైపు నటిగా అనసూయ వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా ఉన్నారు. కరోనా విజృంభణ వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడటంతో అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఆహా థ్యాంక్యూ బ్రదర్ డిజిటల్ హక్కులను 1.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
అనసూయ ఒక ఈవెంట్ కు లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. థ్యాంక్యూ బ్రదర్ థియేటర్లలో రిలీజై ఉంటే థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా నిర్మాతలకు ఎక్కువ మొత్తంలో లాభం వచ్చేది. అనసూయ మూవీ డిజిటల్ హక్కులు తక్కువ మొత్తానికి అమ్ముడవడంతో అనసూయ అభిమానులు అవమానంగా ఫీలవుతున్నారు. ఆహా ఓటీటీ నిర్వాహకులు థ్యాంక్యూ బ్రదర్ మూవీ హక్కులను చీప్ గా కొట్టేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మాగుంట శరత్ కుమార్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా రమేష్ రాపర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒక యువకుడు, గర్భవతి అయిన మహిళ లిఫ్ట్ లో ఇరుక్కున్న తరువాత ఎదురైన పరిస్థితులకు సంబంధించిన కథతో థ్యాంక్యూ బ్రదర్ తెరకెక్కింది. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. థ్యాంక్యూ బ్రదర్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం అనసూయకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!