‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తో వెంకీ!

  • February 1, 2021 / 07:19 PM IST

‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.. తన రెండో ప్రాజెక్ట్ విక్టరీ వెంకటేష్ తో చేయాల్సివుంది. ‘పెళ్లిచూపులు’ సినిమాను రిలీజ్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించాలి. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా తీశాడు. ఇది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో వెంకీతో సినిమా ఉంటుందో లేదోననే సందేహాలు కలిగాయి. చాలా కాలంగా వెంకీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు తరుణ్ భాస్కర్.

ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని సమాచారం. గుర్రపు పందేలా నేపథ్యంలో సాగే ఈ సినిమా స్టోరీ వెంకటేష్ తో పాటు నిర్మాత సురేష్ బాబుకి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే లేదా జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకీ.. సురేష్ ప్రొడక్షన్స్ లో ‘నారప్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే వెంకీ నటిస్తోన్న ‘ఎఫ్3’ సినిమాను కూడా ఇదే ఏడాది ఆగస్టు 27న విడుదల చేయనున్నారు. ‘ఎఫ్3’ షూటింగ్ పూర్తయిన వెంటనే తరుణ్ భాస్కర్ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతాడు వెంకీ. ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తయితే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus