రివ్యూ రైటర్స్ పై అంత మండిపాటు ఎందుకయ్యా తరుణ్

  • July 2, 2018 / 09:40 AM IST

“#పెళ్ళిచూపులు” రిలీజ్ టైమ్ లో సినిమాను పది రోజుల ముందు నుంచి మీడియాకి, రివ్యూ రైటర్లకి రోజుకో స్పెషల్ షో చొప్పున వేసి.. “సినిమా ఎలా అనిపించింది, సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటీ, ప్లస్ పాయింట్స్ ఏంటీ?” అంటూ సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కర్నీ అడిగి మరీ వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించడమే కాదు.. కొన్నిట్నీ పబ్లిసిటీ కోసం వాడుకొన్నాడు కూడా. అలాంటి తరుణ్ భాస్కర్ ఇప్పుడు తన తాజా చిత్రం “ఈ నగరానికి ఏమైంది?” విషయంలో కాస్త తప్పులు చెప్పేసరికి రివ్యూలు, రివ్యూ రైటర్లు మీద మండిపడిపోతున్నాడు. రివ్యూ రైటర్స్ అందరూ ఫిలిమ్ అప్రిసియేషన్ కోర్స్ చేస్తే మంచిది, అసలు ఏం అర్హత ఉందని రివ్యూలు రాస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఇదే తరహాలో ఫిలిమ్ క్రిటిక్స్ అందరూ అప్రిసియేషన్ కోర్స్ చేయాలని “పెళ్ళిచూపులు” చిత్రానికి పాజిటివ్ రివ్యూలు రాసినప్పుడు ఎందుకు అడగలేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అసలు చెప్పాలంటే.. “ఈ నగరానికి ఏమైంది?” సినిమా బాలేదు అని కానీ ఫ్లాప్ అని కానీ ఒక్కటంటే ఒక్క రివ్యూ కూడా రాలేదు. కాకపోతే.. సరైన కథ-కథనం లేకుండా తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీశాడు అని అందరూ పేర్కొన్నారు. మొదటి సినిమాతో నేషనల్ అవార్డ్ దక్కించుకొన్న డైరెక్టర్ సెకండ్ సినిమాకే ఇలా కథ-కథనాలను పక్కన పెట్టేసి కేవలం కామెడీ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తాడని ఎవరు ఎక్స్ పెక్ట్ చేస్తారు చెప్పండి. ఆ నిరాశతోనే తరుణ్ తన తదుపరి చిత్రంతోనైనా ఈ తరహా తప్పులు చేయకూడదనే సదుద్దేశంతోనే రివ్యూలు రాశారు కానీ.. ఎక్కడా కూడా సినిమాని తక్కువ చేయడం కానీ.. తరుణ్ పనితననాన్ని తక్కువ చేయడం కానీ జరగలేదు. కానీ.. తరుణ్ మాత్రం ఇలా అనవసరమైన కామెంట్స్ చేస్తూ.. తన ఇమేజ్ ను దిగజార్చుకుంటున్నాడు తప్ప వేరే ఉపయోగమేమీ లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus