బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం అనూహ్యంగా గీతురాయల్ ఎలిమినేట్ అయ్యిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 10వ వారం నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. శ్రీసత్య కెప్టెన్ కాబట్టి ఈవారం నామినేషన్స్ లో లేదు. అలాగే రాజ్ కి ఇంకా రోహిత్ కి ఓట్లు పడలేదు. ఇక మిగిలిన వాళ్లు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూసినట్లయితే, ఎప్పటిలాగానే రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఈసారి అనూహ్యంగా రేవంత్ కి ధీటుగా ఇనయ తన ఓటింగ్ పవర్ ని చూపిస్తోంది.
ఇనయని బాగా మెచ్చిన ప్రేక్షకులు ఓట్లు వేస్తూ టాప్ లో నిలపెట్టారు. గతవారం డేంజర్ జోన్ లో ఉన్న ఇనయ సుల్తానా ఈవారం ఏకంగా రేవంత్ కి పోటీ ఇచ్చేంతగా ఎదిగింది. యస్, ఐయామ్ ద బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అని చెప్పినపుడు హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు. ఈ నవ్వులే ఆమెకి వరంగా మారాయి. అందుకే, ఇప్పుడు ఓటింగ్ లో తన సత్తాని చూపిస్తోంది. ఓటింగ్ లో శ్రీహాన్ ని ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లింది. ఇక శ్రీహాన్ , కీర్తి ఇద్దరూ కూడా సేఫ్ గానే ఉన్నారు.
ఇక మిగిలిన ఐదుగురిలోనే ఈవారం ఎలినేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిరెడ్డి, మెరీనా, వాసంతీ , ఫైమా ఇంకా బాలాదిత్య ఐదుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అయితే , పాము నిచ్చెనల టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేసిన బాలాదిత్య కొద్దిగా ఓటింగ్ ని మెరుగుపర్చుకున్నాడు. సేఫ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఆదిరెడ్డి కూడా ఈ టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేశాడు కాబట్టి సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన ముగ్గురులోనే ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు.
వీళ్లలో అందరికంటే కూడా వాసంతీ తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తో అందరికంటే లీస్ట్ లో ఉంది. మెరీనా, వాసంతీ, ఫైమాలలో పోలిస్తే వాసంతీకి ఒటింగ్ తగ్గిపోయింది. ఈవారం పాముల టీమ్ లో ఉన్న వాసంతీ రెండో రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయింది. మట్టిని సంపాదించడంలో కూడా విఫలం అయ్యింది. అంతేకాదు, బిగ్బాస్ తర్వాత ఇచ్చిన అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోలేకపోయింది. స్టిక్కరింగ్ టాస్క్ లో కూడా త్వరగా అవుట్ అయిపోయింది.
దీంతో శ్రీసత్య, రోహిత్ ఇద్దరికీ కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం దక్కింది. ఇక ఈవారం వాసంతీ ఎలిమినేట్ అవుతుందనే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాసంతీకి అఫీషియల్ ఓటింగ్ బాగా వచ్చినా, లేదా బిగ్ బాస్ టీమ్ సేవ్ చేయాలని అనుకున్నా ఫైమా లేదా మెరీనా ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి చూద్దాం.. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది. అదీ మేటర్.