Bigg Boss Telugu 6: డేంజర్ జోన్ లో ఉన్నది ఈ ముగ్గురే..! ఈవారం ఎలిమినేషన్ ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లో వీకండ్ వస్తే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది ఎలిమినేషన్ గురించే. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఎంతో ఇంట్రస్ట్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో లీక్స్ వచ్చినా కూడా వాళ్లే ఎలిమినేట్ అవుతున్నారా లేదా అనేది టెలివిజన్ ప్రేక్షకులకి ఎప్పుడూ క్యూరియాసిటీగానే ఉంటుంది. ఇప్పుడు ఆరోవారం బిగ్ బాస్ హౌస్ లో నుంచీ ఎవరు వెళ్లిపోబోతున్నారు అనేది అప్పుడే సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది. ప్రస్తుతం 9మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ అయితే, నలుగురు మేల్ కంటెస్టెంట్స్.

అన్ అఫీషియల్ సైట్స్ లో శ్రీహాన్ టాప్ పొజీషన్ లో సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అయితే, మిగతా వాళ్లు ఎవ్వరూ కూడా ఈసారి సేఫ్ జోన్ లో లేకపోవడం గమనార్హం. శ్రీహాన్ టాప్ లో ఉంటే ఆదిరెడ్డి కొద్దిగా బెటర్ పొజీషన్ లో రెండోస్థానంలో ఉన్నా కూడా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, కేవలం 14శాతం ఓటింగ్ ని మాత్రమే ప్రభావితం చేశాడు. మిగతావాళ్లు కూడా 12, 13శాతం వరకూ ఉన్నారు. కాబట్టి రెండోస్థానంలో ఉన్నా కూడా ఇది డేంజర్ జోనే. ఆతర్వాత గీతు ఇంకా శ్రీసత్య ఉన్నారు.

వీళ్లు కూడా ఈసారి డేంజర్ జోన్ లోకి వచ్చారు. అలాగే సుదీప , రాజశేఖర్, బాలాదిత్య, కీర్తి, మెరీనా లు కూడా లీస్ట్ లోనే ఉన్నారు. అందుకే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ , పోల్స్ చూస్తే మెరీనా, బాలాదిత్య, రాజశేఖర్ డీప్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈవారం సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం చూసినట్లయితే., బాలాదిత్య , రాజశేఖర్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

రెండురోజులు ఓటింగ్ లో వీరిద్దరే అన్ని వెబ్ సైట్ పోలింగ్స్ లో లీస్ట్ లో ఉన్నారు. బాలాదిత్య కి 10 పర్సెంట్ వరకూ ఓటింగ్ జరిగినా కూడా డేంజర్ లో ఉన్నాడు. నిజానికి గతంలో కూడా బాలాదిత్య లీస్ట్ లో ఉన్నా సేఫ్ అయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం మెరీనా, బాలాదిత్య, రాజశేఖర్, కీర్తి నలుగురులో ఇద్దరు వెళ్లిపోయే అవకాశం ఉంది.

సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం బాలాదిత్య ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా అనూహ్యమైన డెసీనష్ తీస్కుంటే, రివ్యూవర్స్ అయిన గీతు, ఇంకా ఆదిరెడ్డి ఇద్దరిలో ఒకర్ని పంపించే అవకాశమూ లేకపోలేదు. ఏది ఏమైనా ఈవారం ఎలిమినేషన్ లో పెద్ద ట్విస్ట్ ఉండబోతోందని బిగ్ బాస్ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus