Bigg Boss Telugu 6: ఆ మేటర్ నాగార్జున అడుగుతారా ? వీకండ్ ఆటలో మజా ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ ఆరోవారం వీకండ్ అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. వీకండ్ నాగార్జున ఖచ్చితంగా కొన్ని విషయాలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా కీర్తి నామినేషన్స్ తర్వాత అన్నమాటలు ఖచ్చితంగా అడగాలి. ఇది ఆడియన్స్ లో ఎంతో క్యూరియాసిటీని కలిగించింది. శ్రీసత్య ఇనయని ఎంత మాట అన్నదో తెలుసా అది చెప్తే పెద్ద గొడవలు అయిపోతాయ్ అంటూ కీర్తి మాట్లాడింది. అసలు శ్రీసత్య అన్న మాట ఏంటి అనేది ఇప్పుడు నాగార్జున అడగాల్సిన అవసరం ఉంది. అలాగే, రోహిత్ శాక్రిఫైజ్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతారు.

ఒకటే సారి అంత పెద్ద డెసీషన్ తీస్కున్నందుకు అభినందిస్తూనే రెండువారాలు నామినేషన్ అంటే ఎంత పెద్ద విషయమో హౌస్ మేట్స్ కి చెప్పాలి. అందరూ స్వార్ధంగా గేమ్ ఆడుతున్న ఈ టైమ్ లో రోహిత్ ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్ అనేది అడగాల్సిన అవసరం ఉంది. నిజానికి రోహిత్ ఇప్పుడు కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. కెప్టెన్ అయినా కూడా తనకి ఇమ్యూనిటీ రాదు. అందుకే, హౌస్ మేట్స్ రోహిత్ కి బదులుగా వేరే వాళ్లని కెప్టెన్ గా ఎన్నుకునే ఛాన్స్ ఉంది.

ఇదే రీజన్ చెప్పి హౌస్ మేట్స్ ఓట్లు వేస్తారా లేదా అనేది ఆసక్తికరం. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ చూసినట్లయితే, వేరేవాళ్ల పేరుతో ఉన్న కుండీని తీస్కుని ఫాస్ట్ గా రావాలి. ఏ ఇద్దరైతే లాస్ట్ లో మిగులుతారో వాళ్లు కెప్టెన్సీ అర్హత ఎవరికి ఉంది అనేది హౌస్ మేట్స్ ఓటింగ్ చేస్తారు. ఇది కొత్త టాస్కేం కాదు, లాస్ట్ సీజన్ లో నామినేషన్స్ అప్పుడు పెట్టిన టాస్కే. ఎవరు నామినేట్ అవ్వాలి. ఎవరు సేవ్ అవ్వాలి అనేది హౌస్ మేట్స్ కి అప్పుడు ఓటింగ్ పెట్టారు.

సీజన్ 5లో ఈ టాస్క్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బ్యాగ్స్ కోసం డెన్ లోకి వెళ్లి అందరూ పోటీపడ్డారు. కాజల్ అప్పుడు ఆటని పూర్తిగా మార్చేసింది శ్రీరామ్ చంద్రకి ఇచ్చిన మాట ప్రకారం గేమ్ ఆడింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది కానీ, ఇది కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టాడు బిగ్ బాస్. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే, సూర్య ఇంటి కెప్టెన్ అయ్యాడని తెలుస్తోంది. నిజానికి ఈ టాస్క్ ప్రారంభం అయ్యే ముందు గీతు సూర్యకి గేమ్ ఎలా ఆడాలో కూడా చెప్పింది.

ఫస్ట్ ఎవరెవరికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయో వాళ్లతో పోటీ పడమని చెప్పింది. రోహిత్, ఇంకా సూర్య మీ ఇద్దరిలోనే ఇంటి సభ్యులు ఎంచుకోవాలని అనుకుంటున్నారని సూర్యతో చెప్పింది గీతు. ఇక్కడ రెండు వారాలు నామినేషన్ రోహిత్ శాక్రిఫైజ్ చేసినందుకు బిగ్ బాస్ రోహిత్ అండ్ మెరీనాకి గిఫ్ట్స్ పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ వీకండ్ నాగార్జున ఎలాంటి పాయింట్స్ పై హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus