సహజత్వం మిస్సయ్యింది..!

2014 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘క్వీన్’. కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న తొలి ఇండియన్ లేడి ఓరియెంటెడ్ చిత్రంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు మలయాళం – తమిళ్ అలాగే కన్నడలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్ర తెలుగు రీమేక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ కాబోతోన్న ఈ చిత్రాన్ని ‘అ!’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.క ఈ చిత్రాన్ని మను కుమారన్ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిచడం విశేషం.

ఈరోజు తమన్నా పుట్టినరోజు కావడంతో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ టీజర్ ను విడుదల చేసిందది చిత్రయూనిట్. ఇక టీజర్ చూస్తే ఇది పూర్తిగా కామెడీ డ్రామా ఫిల్మ్ గా కనిపిస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ ఒరిజినల్ ‘క్వీన్’ ఛాయలే కనిపిస్తుంది. ఇక తమన్నా పెర్ఫార్మన్స్ .. ఏమాత్రం కంగనాకు మ్యాచ్ కాకపోగా చాలా ఇరిటేట్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా రాజమండ్రి స్లాంగ్ మాట్లాడుతున్నప్పుడు తమన్నాలో ఏమాత్రం సహజత్వం కనిపించకపోవడం గమనార్హం. హనీమూన్ అంటూ ఒంటరిగా ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసే ఒక రాజమండ్రి అమ్మాయి వివిధ రకాల మనుషూలను కలుస్తుంది.అటు తరువాత ఆమె ఎదుర్కొన్న అనుభవాలు ఏంటనేది మిగిలిన కథాంశం. ఇక ఈ చిత్రాన్ని మను కుమారన్ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిచడం విశేషం.2019 జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

                   

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus