Rashmika: రష్మిక రక్షిత్ బ్రేకప్ కి అదే కారణమా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎన్నో సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె గతంలో తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న విషయం మనకు తెలిసిందే.

కన్నడ సినీ నటుడు రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉన్నటువంటి రష్మిక తనని 2017 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి కిరిక్ పార్టీ అనే సినిమాలో నటించారు. రష్మికకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే నిశ్చితార్థం తర్వాత రష్మిక బ్రేకప్ చెప్పడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వేణు స్వామి కారణమని తెలుస్తుంది. ఆయన వీరిద్దరి జాతకాలు చూసి ఇద్దరి జాతకాలు ఏమాత్రం బాగాలేవని పెళ్లి చేసుకున్న విడిపోక తప్పదని తెలిపారట. అలాగే పెళ్లి చేసుకుంటే రష్మిక సినీ కెరియర్ ఆగిపోతుందని చెప్పడంతో సినిమాలపై ఆసక్తి ఉన్నటువంటి రష్మిక ఇండస్ట్రీలో కొనసాగడం కోసం తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.

నిశ్చితార్థాన్ని బ్రేకప్ చేసుకున్న (Rashmika) ఈమె అనంతరం సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus