Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Non-Stop Winner: ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత ఉంది ఆమెకేనా..?

Bigg Boss Non-Stop Winner: ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత ఉంది ఆమెకేనా..?

  • April 6, 2022 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Non-Stop Winner: ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత ఉంది ఆమెకేనా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ లైవ్ అంటూ ఓటీటీ లో దుమ్మురేపుతోంది. ఈసారి సీజన్ 1 గా ఓటీటీలో వచ్చిన ఈ రియాలిటీషో ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా హౌస్ మేట్స్ కి సంబంధించిన న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఓటీటీ సీజన్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈసారి ఛాలెంజర్స్, వారియర్స్ అంటూ సీనియర్స్ ని జూనియర్స్ ని కలిపాడు బిగ్ బాస్.

ఇందులో భాగంగా చాలామంది సీనియర్స్ ట్రోఫీ కోసం పోటీ పడ్డారు. ఐదు వారాల్లో అనూహ్యంగా ఎలిమినేషన్స్ అనేవి జరిగాయి. ముమైత్ ఖాన్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయి మళ్లీ మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, అనూహ్యంగా ఐదోవారం తేజస్వి ఎలిమినేట్ అయిపోయింది. ఇక నామినేషన్స్ లోకి వస్తున్న ప్రతిసారి హౌస్ మేట్స్ తమ ఓటింగ్ లో సత్తాని చూపిస్తున్నారు. గత కొద్ది వారాలుగా అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని చూస్తుంటే బిందు మాధవికి 40శాతం వరకూ కూడా ఓటింగ్ అనేది జరుగుతోంది.

గతంలో అఖిల్ తో పోటీ పడ్డ అభిజీత్ ఇలాగే 40శాతం వరకూ ఓటింగ్ ని కైవసం చేసుకున్నాడు. ప్రతిసారి నామినేషన్స్ లోకి వచ్చి సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా అఖిల్ టాస్క్ లు ఎంత బాగా ఆడినా, ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నా కూడా రేస్ లో వెనకబడిపోయాడు. సీజన్ 4 ఫినాలేలో రన్నరప్ గా నిలిచాడు అఖిల్. అయితే, ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతోందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

దీనికి కారణం ఏంటంటే, లాస్ట్ టైమ్ అభిజీత్ అఖిల్ తో పడిన గొడవలు, ఇప్పుడు బిందు అఖిల్ ని ఎదిరించిన సీన్స్ ఈ రెండిటిని వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. అందుకే, బిందుమాధవి ఇప్పుడు అఖిల్ కి ఫినాలేలో టఫ్ ఫైట్ ఇచ్చేలాగానే కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి వేరేవాళ్లు ఓటింగ్ లో దూసుకుపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్లిద్దరినీ ఓవర్ టేక్ చేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఆరోవారం కూడా బిందు ఓటింగ్ లో దూసుకుపోతోంది.

మొదటి ప్లేస్ లోనే కొనసాగుతోంది. అఖిల్ ఇంకా బిందు ఇద్దరూ నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది విన్నర్ ని డిసైడ్ చేసే వీక్ అవుతుంది. గత కొన్ని సీజన్స్ గా చూస్తే బిగ్ బాస్ టైటిల్ ని మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే గెలుచుకున్నారు. ఈసారి ఓటీటీలో బిందుమాధవి టైటిల్ పై కన్నేసిందనే చెప్పాలి. గేమ్ ఆడే పద్దతి, అలాగే ఆడపులిలాగా అందర్నీ ఎదిరించే తీరు బిగ్ బాస్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మాములు కంటెస్టెంట్ గా ఛాలెంజర్ గా వచ్చిన బిందు ఇప్పుడు వారియర్స్ జట్టుకి గట్టి పోటీ ఇస్తోంది.

ముఖ్యంగా ఫిమేల్ కంటెస్టెంట్స్ అందర్నీ ఓవర్ టేక్ చేస్తూ ముందుకు వెళ్లోంది. కెప్టెన్సీ టాస్క్ పైన కానీ, వేరే ఏ టాస్క్ పైన కానీ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. అలాగని ఎగ్రసివ్ గా టాస్క్ లలో కూడా ఆడట్లేదు. మిగతా వాళ్లతో పోలిస్తే బిందు టాస్క్ లో పెర్ఫామన్స్ తక్కువే. కానీ, బయట ప్రేక్షకుల హృదయాలని మాత్రం గెలుచుకుంటోంది. మరి ఈసారి అఖిల్ కంటే వేగంగా ఓటింగ్ లో దూసుకుపోతే మాత్రం ఖఛ్చితంగా ఈసారి బిందుమాధవి విన్నర్ గా నిలుస్తుందనే చెప్పాలి. ఈసారి బిందు, శివ కలిసి ఫ్రెండ్షిప్ బాండ్ ని చూపించడం కూడా ఆమెకి కలిసొచ్చే అంశమే. మరి ఈ నేపథ్యంలో బిందు గేమ్ ఇంకా ఎలా మారుతుంది అనేది ఆసక్తికరం.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindu Madhavi

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

4 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

8 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

9 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

11 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version