Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..!

  • October 21, 2023 / 11:22 AM IST

దసరా కానుకగా మూడు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘భగవంత్ కేసరి’, ఇంకోటి ‘లియో’, మరొకటి ‘టైగర్ నాగేశ్వరరావు’. ‘భగవంత్ కేసరి’ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ‘లియో’ కి నెగిటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మూడింటిలో బాలయ్య సినిమాకి ఎక్కువ టికెట్లు సేల్ అయ్యే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి.. బాలకృష్ణని ప్రజెంట్ చేసిన తీరు బాగుంది.

మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య యాక్టింగ్ ఇరగదీశారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడైనా ల్యాగ్ అనే ఫీలింగ్ జనాలకి కలిగినప్పుడు ఎలివేషన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ వచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమాలో ఇప్పటి సమాజానికి ఉపయోగపడే ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..

‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) లో ఓ చిన్న లాజిక్ మిస్ అయ్యింది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అదేంటి అంటే.. సినిమాలో శ్రీలీలకి అసలు తండ్రి శరత్ కుమార్. అతను ఒక జైలర్. కానీ ఆ పాత్ర చనిపోయినప్పుడు మాత్రం న్యూస్ ఛానల్స్ లో సి.ఐ అంటూ చెబుతారు. ఈ మిస్టేక్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడిని ప్రశ్నించగా.. ‘ఇంత పెద్ద సినిమాలో ఆ చిన్న పొరపాటుని ఎలా గమనించారో తెలీడం లేదు. అయితే అది మా వాళ్ళ తప్పే.క్షమించండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus