Adipurush: ‘ఆదిపురుష్’ వల్ల ఆ హీరోయిన్ కు అన్యాయం జరిగిందా?

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ నిన్న రిలీజ్ అయ్యింది. నిన్నటి నుండి ట్రెండింగ్లోనే ఉంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ చాలా బాగా నమోదయ్యాయి. ట్రోలింగ్ చేసే బ్యాచ్ సంగతి పక్కన పెడితే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడటానికి ఎగబడుతున్నారు. ప్రభాస్ వంటి హీరో శ్రీరాముని పాత్రలో నటించడంతో మూవీ పాన్ ఇండియా వైడ్ సంచలనాలు సృష్టిస్తుంది. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని కించపరిచాడు అంటూ కేసులు పెడుతున్నా జనాలు థియేటర్ కు వెళ్ళడానికి నిరాకరించడం లేదు.

వీకెండ్ వరకు (Adipurush) ‘ఆదిపురుష్’ కి డోకా లేదు. తర్వాత సంగతి ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా.. ‘ఆదిపురుష్’ లో సోనాల్ చౌహన్ కూడా నటించింది.’లెజెండ్’ ‘పండగ చేస్కో’, ‘షేర్’,’సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’, ‘ఘోస్ట్’, ‘ఎఫ్3’ వంటి చిత్రాల్లో నటించిన ఈమెకి ఇప్పటివరకు మంచి నటి అనిపించుకున్న పాత్ర ఒక్కటి కూడా దొరకలేదు. అయితే ‘ఆదిపురుష్’ లో ఈమెకు మండోదరి పాత్ర చేసే అవకాశం దక్కింది. చాలా మందికి మండోదరి పాత్ర గురించి తెలీదు.

‘రామాయణం’ లో సీతమ్మ తల్లి ఎంత గొప్పదో, మండోదరి అంతకన్నా గొప్పది. రావణాసురుడు భార్య అయినప్పటికీ మండోదరి చాలా మంచి వ్యక్తి అని చరిత్ర చెబుతుంది. అలాంటి పాత్ర చేసే ఛాన్స్ దొరకడం సోనాల్ అదృష్టమని చెప్పాలి. కానీ ఆమె పాత్ర కేవలం రెండు సీన్లకి మాత్రమే పరిమితమవ్వడం ఆమె దురదృష్టం. ఈ పాత్రకి గాను ఆమెకు రూ.40 లక్షలు పారితోషికం ఇచ్చారట. అయినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా వరకు తగ్గించేశారని ఇన్సైడ్ టాక్. నిజం ఇది ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus