ప్రభాస్ 21 తో పాటు ఎన్టీఆర్ 31 పై కూడా కన్నేసినట్టున్నాడుగా…!

ప్రభాస్ తో సినిమా చెయ్యాలని చాలా మంది దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. అశ్వినీ దత్ మాత్రం తన అల్లుడు నాగ్ అశ్విన్ తో సినిమా .. ప్రభాస్ తో సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయించాడు. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసాడు. దీంతో మిగిలిన ప్రొడ్యూసర్లు… డైరెక్టర్లకు పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ప్రభాస్ తో సినిమా చేస్తే .. పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిపోవడం ఖాయం.

అలాంటి గోల్డెన్ ఛాన్స్ చాలా ఈజీగా దక్కించుకున్నారు ఆశ్వినీదత్. ఇప్పుడు మరోస్టార్ హీరో ఎన్టీఆర్ తో కూడా సినిమా నిర్మించడానికి అహర్నిసలు ప్రయత్నిస్తున్నాడు అశ్వినీదత్. ఈ చిత్రం తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తో ఉండబోతుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్టు రెవీల్ చేసాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి త్రివిక్రమ్ రెడీగా ఉన్నాడు.

ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం. ఇక 31వ చిత్రం చేయడానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాత అశ్వినీ దత్ … దర్శకుడు అట్లీ తో చేయించాలని ట్రై చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ చూపు ఎవరి వైపు ఉందో.. ఎవరి ప్రాజెక్ట్ ఓకే చేస్తాడో. ‘ప్రభాస్ 21’ ను దక్కించుకున్నట్టు ఎన్టీఆర్ 31 కూడా అశ్వినీ దత్తే కొట్టేస్తారేమో చూడాలి..!

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus