2000 వ సంవత్సరం అక్టోబర్ 13న విడుదలైన ‘నువ్వే కావాలి’ చిత్రం అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్’ పై రామోజీరావు గారు నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ సమకూర్చిన సంభాషనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు తరుణ్.
దర్శకుడు విజయ్ భాస్కర్ డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది ఆ టైములో..! 1999లో వచ్చిన ‘నీరం’ అనే మలయాళం చిత్రానికి రీమేక్ ఇది. కోటి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసాడట ఓ స్టార్ డైరెక్టర్. అతను మరెవరో కాదు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మోహన్ రాజా.
ఈయన ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి అన్న సంగతి తెలిసిందే. నిర్మాతగా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు ఎడిటర్ మోహన్ గారు. అదే క్రమంలో మోహన్ రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నువ్వే కావాలి’ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని ఆయన భావించారట. అయితే ఇందుకు దర్శకుడు మోహన్ రాజా ఒప్పుకోలేదట. డెబ్యూ మూవీ రీమేక్ చేయడమేంటి అని తప్పుకున్నాడట. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
అటు తర్వాత ఎడిటర్ మోహన్ గారు మలయాళం సూపర్ హిట్ మూవీ ‘థెన్ కాశి పట్టణం’ ని రీమేక్ చెయ్యమని అన్నారట. ఈసారి నాన్నగారి మాట కాదంటే బాగోదని ఆ చిత్రం సోల్ ను అర్ధం చేసుకుని ‘హనుమాన్ జంక్షన్’ గా రీమేక్ చేసాడట మోహన్ రాజా. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసాడు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!