మంచి దొంగ వంటి మాస్ సినిమాతో హిట్టు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి.. అటు తర్వాత ఎందుకో రుద్రవీణ అనే క్లాస్ మూవీ చేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1988 మార్చి 4 న విడుదల అయ్యింది. మెగా బ్రదర్ నాగ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది క్లాస్ మూవీ అయినప్పటికీ బడ్జెట్ కొంచెం ఎక్కువగానే అయ్యిందట. కానీ ఈ సినిమా జనాలకి రుచించలేదు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. చిరంజీవి నటనకి మంచి మార్కులు పడ్డాయి.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో జెమినీ గణేషన్…చిరంజీవి తండ్రి పాత్రని పోషించారు. ఆయన చాలా అద్భుతంగా నటించారు అనే చెప్పాలి. ఈ చిత్రానికి చిరంజీవి పారితోషికం కంటే జెమినీ గణేషన్ పారితోషికం ఎక్కువట. తమ్ముడి సినిమా కాబట్టి చాలా వరకు చిరు పారితోషికం తీసుకోలేదు. అలాగే జెమినీ గణేషన్.. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యేవరకు టీమ్ ని చాలా ఇబ్బందులు పెట్టారట. చిరంజీవి ఈ చిత్రంలో హీరో కాబట్టి, అలాగే నిర్మాత అన్నగారు కాబట్టి..
చిరంజీవికి (Chiranjeevi) యూనిట్ సభ్యులు కొంచెం ఎక్కువ మర్యాద ఇచ్చేవారట. ఇది జెమినీ గణేషన్ కు నచ్చేది కాదు. సన్నివేశం మధ్యలో చిరు ఒకటి రెండు సార్లు కట్ చెప్పి బ్రేక్ తీసుకోవడం కూడా ఆయనకు నచ్చేది కాదట. ఒకటి రెండు సార్లు ఆయన సెట్ నుండీ వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే తర్వాత చిరుతో జెమినీ క్లోజ్ అయ్యారు. సినిమా రిలీజ్ అయ్యాక ఇలాంటి గొప్ప హీరోని నేను చూడలేదు అంటూ ప్రశంసలు కూడా కురిపించారు.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు