The 100 Twitter Review: ది 100 తో ఆర్.కె.సాగర్.. హిట్టు కొట్టాడా?

‘మొగలి రేకులు’ అనే సీరియల్లో ఆర్.కె.నాయుడు అనే పోలీస్ పాత్రతో బుల్లితెరపై స్టార్ గా ఎదిగాడు ఆర్.కె.సాగర్ . ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేశాడు. ఈ క్రమంలో ‘సిద్ధార్థ’ ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ‘షాదీ ముబారక్’ వంటివి వచ్చాయి. ఇందులో ‘షాదీ ముబారక్’ ని ఓటీటీలో బాగానే చూశారు. కానీ తర్వాత వెంటనే సాగర్ హీరోగా సినిమా చేయలేదు. సీరియల్స్ లో కూడా ఎక్కువగా కనిపించింది లేదు. ‘రంగస్థలం’ ‘ఓజి’ వంటి సినిమాల్లో సహాయ నటుడిగా అవకాశాలు వచ్చినా చేయలేకపోయానని ఓపెన్ గానే చెప్పాడు.

The 100 Movie Twitter Review

మొత్తానికి అతను హీరోగా చేసిన ‘ది 100’ ఈ శుక్రవారం అంటే జూలై 11న విడుదల కానుంది. అయితే రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన తర్వాత కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేశారు. వారి టాక్ ప్రకారం.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయినప్పటికీ విక్రాంత్(ఆర్.కె.సాగర్) తన రివాల్వర్ కి పని చెప్పకుండా కేసులను సాల్వ్ చేయాలని భావిస్తాడు. కానీ ఆర్తి(మిష నారంగ్) అనే అమ్మాయి కోసం అతను గన్ వాడాల్సి వస్తుంది.

అది ఎందుకు అనేది మిగిలిన కథ అని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఫైట్స్, ట్విస్ట్స్, ఇంటర్వెల్ బ్లాక్ వర్కౌట్ అయినట్టు చెబుతున్నారు. సెకండాఫ్ లో ఎమోషన్, క్లైమాక్స్ వర్కౌట్ అయినట్టు చెబుతున్నారు. ఆర్.కె.సాగర్ కి మంచి హిట్ పడింది అంటున్నారు. మరి రిలీజ్ రోజున అంటే జూలై 11న మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

 

మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus