Chiranjeevi, Balakrishna: చిరు, బాలయ్య సినిమాలకు ఎంత ఖర్చయిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఇదివరకు చాలా సార్లు ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇప్పుడు మరోసారి రేసులో నిలిచారు. ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఒకేసారి రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ని చేపట్టడంతో పాటు ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాల కోసం మైత్రి సంస్థ ఎంత ఖర్చు పెట్టిందనే విషయం బయటకొచ్చింది.

చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాకి దాదాపుగా రూ.140 కోట్ల బడ్జెట్ అయిందట. రెమ్యునరేషన్స్ అన్నీ కలుపుకొని ఇంత మొత్తమని తెలుస్తోంది. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమా ఫైనల్ బడ్జెట్ రూ.110 కోట్లు. ఈ రెండు సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. థియేట్రికల్, నాన్ థియేట్రికల్, డబ్బింగ్ రైట్స్ అన్నీ కలుపుకుంటే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నారని సమాచారం.

ఇంత బిజినెస్ చేసిన సినిమాలు అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తారేమో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి తన టీమ్ తో కలిసి యూరప్ కి వెళ్లారు. అక్కడ చిరంజీవి, శృతిహాసన్ ల మధ్య ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. మరోపక్క బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. దాన్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించనున్నారు.

డిసెంబర్ 18 నాటికి మొత్తం షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కూడా శృతిహాసనే హీరోయిన్. ‘వీరసింహారెడ్డి’ సినిమా జనవరి 12న, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా జనవరి 13న రిలీజ్ కానున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus