పూజ హెగ్డే- ప్రభాస్ జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ ఇటీవల విడుదలై పర్వాలేదు అనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యిందనే చెప్పాలి. బెనిఫిట్ షోలు వంటివి ఇలాంటి సినిమాలకి ఎంత ప్రమాదకరమో ఈ చిత్రం ద్వారా ప్రూవ్ అయ్యింది. మార్నింగ్ షోలు చూసిన జనాలు అంతా బాగానే ఉంది అన్నారు. కానీ అప్పటికే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ‘రాధే శ్యామ్’ డేంజర్ జోన్లో పడింది.
అయితే ఈ మూవీని మరీ అంత తీసిపారేయలేము. స్లోగా సాగినా ఇందులో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. కానీ నెగిటివ్ టాక్ ను ఆధారం చేసుకుని చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రం చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఇక ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ.. అసలు విషయానికి వద్దాం. పూజా హెగ్డే నటించిన మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంటుంది. అది ‘రాధే శ్యామ్’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.
విషయం ఏంటంటే ‘రాధే శ్యామ్’ లో విక్రమాదిత్య(ప్రభాస్) యాక్సిడెంట్ భారిన పడి గాయాలతో ప్రేరణ(పూజ) పనిచేస్తున్న హాస్పిటల్ కు వస్తాడు. తర్వాత ఆమె అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సీనే పూజ గత చిత్రాల్లో కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. పూజ హెగ్డే మొదటి చిత్రం ‘ఒక లైలా కోసం’ లో కూడా హీరో నాగచైతన్య యాక్సిడెంట్ అయ్యాక పూజ వద్దకి వచ్చి పడతాడు.
అలాగే ‘ముకుంద’ సినిమాలో కూడా వరుణ్ తేజ్ గాయాలు పాలయ్యాక పూజ వద్దకు వచ్చి పడతాడు. ఇప్పుడు ఈ మూడు సన్నివేశాలను గమనించి నెటిజెన్లు వీటిని వైరల్ చేయడం మొదలుపెట్టారు.