Devara, Thandel: దేవరకు పోటీగా చైతన్య మూవీని రిలీజ్ చేయడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు సరైన రిలీజ్ డేట్లు దొరకడం కష్టమవుతోంది. మంచి రిలీజ్ డేట్లను ఎంచుకున్నా ఆ సమయానికి పెద్ద సినిమాలకు పోటీగా మరికొన్ని సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరకు పోటీగా తండేల్ మూవీ రిలీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. దేవర అక్టోబర్ 10న రిలీజ్ కానుండగా తండేల్ మూవీ అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదలైతే మాత్రం రెండు సినిమాలలో ఒక సినిమా నష్టపోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాకు పోటీగా విడుదల చేస్తే తండేల్ కు ఎక్కువ నష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే తండేల్ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. సాధారణంగా దసరా పండుగకు రెండు లేదా మూడు సినిమాలకు ఛాన్స్ ఉంది.

అందువల్ల దేవర, తండేల్ బాక్సాఫీస్ క్లాష్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది దసరా రేసు మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓజీ, దేవర సినిమాలు రెండు వారాల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా.

దేవర సినిమా వాయిదా పడటంతో ముందుగా ప్రకటించిన దేవర డేట్ కు అటూఇటుగా పలు సినిమాలు షెడ్యూల్ చేసుకుంటున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండగా ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాల్సి ఉంది. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దేవర సినిమాపై అంచనాలు ఊహించని రేంజ్ లో పెరుగుతున్నాయి.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus