Samantha: సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత ఫ్యామిలీ మెన్..!

  • June 24, 2021 / 05:31 PM IST

విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా నటించిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అమెజాన్ ప్రైమ్లో మోస్ట్ వ్యూడ్‌ వెబ్ సిరీస్‌ లో ఒకటిగా నిలిచింది ‘ఫ్యామిలీ మెన్’. ఇక దీనికి కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించారు రాజ్ అండ్ డీకే.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ తో సమంత డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది అని తెలిసిన వెంటనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన ‘ది ఫ్యామిలీ మెన్2’ ట్రైలర్ వివాదాస్పదం అయినప్పటికీ.. అది పబ్లిసిటీకి బాగానే పనికొచ్చింది అని చెప్పాలి.ఇక తెలుగు వెర్షన్ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ చాలా వరకు తెలుగు ప్రేక్షకులు హిందీలో ఈ వెబ్ సిరీస్ ను చూసేసారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఇందులో రాజీ అనే శ్రీలంక తమిళియన్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి.. ప్రేక్షకులను అలరించింది సమంత.ఈ వెబ్ సిరీస్ తో తనలోని కొత్త కోణాన్ని చూపించి ప్రశంసలు అందుకుంది. ఇక ‘ది ఫ్యామిలీ మెన్2’ వరల్డ్ మోస్ట్ పాపులర్ షోస్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం మరో విశేషం.ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి విడుదల చేసిన జాబితాలో మోస్ట్ పాపులర్ షోస్ ఇన్ ది వరల్డ్ లిస్ట్ లో ‘ది ఫ్యామిలీ మెన్ 2’ 4వ స్థానాన్ని దక్కించుకుంది.హాలీవుడ్ కి చెందిన లోకి, స్వీట్ టూత్, మేర్ ఈస్ట్ టౌన్.. వంటి షోలు మొదటి 3 స్థానాలు సంపాదించుకున్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus