బాహుబలికి లేటెస్ట్ వెర్షన్ “ది ఫ్యామిలీ పిశ్చర్”
- October 28, 2016 / 01:43 PM ISTByFilmy Focus
బారుబలి, రెబల్ బాబు, బట్టప్ప, పోనా బాబు, దురద సేన, అన్నపూర్ణ వంకర.. ఈ పేర్లు వింటుంటే ఎక్కడో విన్నట్లుంది కదూ. వినడమే కాదు చూసారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన బాహుబలి చిత్రంలోని పేర్లు మాత్రమే కాదు, ప్రతి సీన్, ఫ్రేమ్ తెలుగు సినీ ప్రజలకు గుర్తే. ఇప్పటివరకు ఆ సినిమాపై పూర్తి స్థాయిలో స్పూఫ్ ఎవరూ చేయలేదు. మొదటి సారి “సినీఅమ్మ” యూట్యూబ్ ఛానల్ వాళ్లు రాజమౌళి ఫ్యామిలీ, బాహుబలి చిత్రంపై సరదాగా “ది ఫ్యామిలీ పిశ్చర్” అనే షార్ట్ ఫిలిం ని రూపొందించారు.
బాహుబలి అభిమానులకు ఇందులో ఒక సర్ ప్రయిజ్ గిఫ్ట్ కూడా ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వినూత్నంగా చెప్పి నవ్వులు పంచారు. ఈ వీడియోని చూస్తే పోయేది ఏమిలేదు డూడ్.. కొన్ని నవ్వులు తప్ప.
https://www.youtube.com/watch?v=TrKgyo_fVF4
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














