అన్నా చెల్లెళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించిన సినిమాలు

రక్త సంబంధాల్లో అన్నాచెల్లెలి అనుబంధం ప్రత్యేకమైంది. సరదాగా కొట్టుకుంటారు. స్నేహితుల్లా జట్టుకడుతారు. చెల్లెలికి ఏ కష్టమొచ్చినా అన్న తట్టుకోలేడు. అన్న కళ్ళల్లో కన్నీరు చూస్తే చెల్లెలు విలవిలలాడిపోతుంది. అన్న.. చెల్లెల్ని అమ్మలా చూసుకుంటే.. చెల్లెలు అన్నని బిడ్డలా ప్రేమిస్తుంది. వీరిమధ్య అనుబంధాన్ని మన దర్శకులు అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఆశీర్వదించి విజయాన్ని అందించారు. రాఖీ పండుగా సందర్భంగా అన్నా చెల్లెళ్ల కథలతో రూపొందిన టాప్ టెన్ చిత్రాలు..

రక్త సంబంధం మహానటుడు ఎన్టీఆర్, మహానటి సావిత్రి.. వీరిద్దరూ భార్య భర్తలుగా అనేక సినిమాలు కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. అలాగే అన్న చెల్లెలుగా నటించి .. మెప్పించారు. అందరి కంట కన్నీరు తెప్పించారు.

చెల్లెలి కాపురంచెల్లెలి కాపురం బాగుండాలని తన పేరు, ఉనికినే కోల్పవడానికి సిద్ధపడ్డ ఓ అన్న కథ ఇది. అన్న ప్రతిభ ప్రపంచానికి తెలియాలని ముందడుగు వేసిన చెల్లి కథ ఇది. చెల్లెలి కాపురం సినిమాలో అన్న చెల్లెలిగా శోభన్ బాబు, వాణిశ్రీ చక్కగా నటించారు.

ముద్దుల మామయ్య బాలకృష్ణ అందరితో మామయ్య అని పిలుపించుకునేలా చేసిన సినిమా ముద్దుల మామయ్య. ఇందులో సీతకు అన్నగా బాలయ్య నటించి ఆకట్టుకున్నారు. బాలకృష్ణకు మరుపురాని చిత్రంగా నిలిచింది.

పల్నాటి పౌరుషంరెబల్ స్టార్ కృష్ణం రాజు పౌరుషం కలిగిన అన్నగా.. అంతకంటే పౌరుషం ఉన్న చెల్లిగా రాధికా.. పల్నాటి పౌరుషం సినిమాలో పోటీ పడి నటించారు. ప్రేక్షుకుల అభినందనలతో పాటు అవార్డ్స్ అందుకున్నారు.

హిట్లర్ అన్నాచెల్లెళ్ల కథల్లోనే హిట్లర్ స్పెషల్. ఎందుకంటే ఇందులో ఐదుగురికి అన్నగా చిరంజీవి నటించారు. చెల్లెలు మంచి ఇళ్లలోకి కోడలుగా వెళ్లాలని కష్టపడే అన్నగా చిరు అందరి హృదయాలను గెలుచుకున్నారు.

శివరామరాజు ముగ్గురు అన్నలకు ఒకే చెల్లెలు ఉంటే అందరికీ గారాలపట్టీ అవుతుంది. ఆమెను అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఆ అనుబంధాన్ని శివరామరాజు చిత్రంలో దర్శకుడు సముద్ర బాగా చూపించారు.

పుట్టింటికి రా చెల్లి యాక్షన్ హీరో అర్జున్ చెల్లెలు సెంటిమెంట్ తో చేసిన మూవీ పుట్టింటికి రా చెల్లి. ఇందులో చెల్లెలిగా స్వప్నమాదిరి పలికించిన అభినయం మహిళా ప్రేక్షకుల మది దోచుకుంది. ప్రధానంగా ఇందులో అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు కంటతడి పెట్టించాయి.

అర్జున్ నేటితరం అన్నాచెల్లెళ్లకి ప్రతిరూపంగా అర్జున్ సినిమాలో మహేష్ బాబు, కీర్తి రెడ్డి లు కనిపించారు. ఇద్దరు కవలలు అయినప్పటికీ అన్నా, అక్క అని పిలుచుకుంటూ ఆకట్టుకున్నారు.

అన్నవరం పవన్ కళ్యాణ్ తముడిగ్గా మాత్రమే కాదు అన్నగా నటించి మార్కులు కొట్టేసిన మూవీ అన్నవరం. ఇందులో పవన్ కి సోదరిగా సంధ్య కూడా బాగా నటించి ప్రేక్షకులను అలరించింది.

రాఖీ ఇబ్బందుల్లో ఉన్న ఆడపడుచుకి అండగా నిలిచిన ప్రతి వ్యక్తి అన్నయ్యే. అలాగే కన్నీరు పెట్టిన ప్రతి అమ్మాయికి అన్నగా మారాడు రాఖీ. రాఖీ సినిమాలో అమ్మాయిలను బాధపెట్టే వారి అంతుచూసే అన్నయ్యగా ఎన్టీఆర్ అదరగొట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus