ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలలో మెజారిటీ సినిమాలకు ఏపీ నుంచి ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తాయి. అయితే ఏపీలో తొలి మొబైల్ సినిమా థియేటర్ రెడీ అవుతోంది. ఈ మొబైల్ థియేటర్ లో ఆచార్య సినిమా తొలి సినిమాగా ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది. ఏపీలోని రాజానగరం ప్రాంతంలో ఈ మొబైల్ మూవీ థియేటర్ ఏర్పాటవుతోంది. ఈ మొబైల్ మూవీ థియేటర్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మొత్తం 120 సీట్ల సామర్థ్యంతో ఈ థియేటర్ సిద్ధమవుతుండగా హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఏపీలో ఈ థియేటర్ ను పిక్చర్స్ డిజిటల్స్ సంస్థ ఏర్పాటు చేస్తోందని తెలుస్తోంది. ఈ మొబైల్ థియేటర్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ టెక్నాలజీలతో ఈ థియేటర్ సిద్ధమవుతోందని టెంట్ లో గాలిని నింపే టెక్నాలజీ ద్వారా ఈ థియేటర్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడితే భవిష్యత్తులో మరిన్ని మొబైల్ థియేటర్లు ఏర్పాటయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రూరల్ ఏరియాలలో ఈ తరహా థియేటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మొబైల్ థియేటర్ లో సౌండింగ్ విధానం, ఇతర విషయాల గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రిలీజవుతున్న సినిమాలలో పెద్ద సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉంటే చిన్న సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.
రెండు పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాను విడుదల చేస్తే ఆ సినిమా భారీగా కలెక్షన్లను సాధించడంలో విఫలమవుతోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, గని సినిమాల ఫలితాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!