లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఎలాగు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఎన్నో వాయిదా పడ్డాయి. వీటి భారం నిర్మాతల పై పడుతుంది. సినిమా నిమిత్తం బ్యాంక్ లకు లక్షల రూపాయలు నిర్మాతలు కట్టాల్సి వస్తుంది. పెద్ద సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాకు అయితే ఎలాగూ థియేట్రికల్ రిలీజ్ ఇవ్వక తప్పదు. అయితే చిన్న సినిమాలు విషయంలో నిర్మాతలు .. ఇంట్రెస్ట్ లు కట్టాలి అంటే ఇబ్బందే.
అందుకే వారు డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చెయ్యాలి అని భావిస్తున్నారు. మొదట హీరోల మాట విని వెనక్కి తగ్గిన నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి ఓ 20 శాతం లాభాలు వస్తే సరిపోతుంది.. మిగిలినది స్ట్రీమింగ్ టైం బట్టి ఇస్తాము అని అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, ఆహా,జీ5 వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు ఆఫర్లు ఇవ్వడంతో నిర్మాతలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి మొదటి సినిమా డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదల కాబోతుంది.
‘అమృతరామమ్’ అనే చిత్రం మొదటిగా ఈ నెల 29 న విడుదల కాబోతుంది. జీ5 వారు ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. సురేందర్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.ఎన్. రెడ్డి నిర్మించారు. మొదట ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ పై సురేష్ బాబు థియేట్రికల్ రిలీజ్ చేద్దామనుకున్నారు. మరి ఆన్లైన్ లో ఈ చిత్రం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!