Star Heroine: పాపం ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ గా చేస్తోంది..అమె ఎవరో తెలుసా..!

టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ముగ్గురు హీరోల ప్రస్తుత స్థితికి ఓ హీరోయిన్ కూడా ఓ కారణమని తెలుసా. ఆమె వారితో నటించిన సినిమాలన్నీ సంచలన విజయాలు సాధించి వారికి ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చి పెట్టాయి. వారెవరో కాదు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. తెలుగులో ఈ ముగ్గురి కెరీర్ ను మార్చిన సినిమాల్లో ఒక్కరే హీరోయిన్. ఆమె ఎవరో గుర్తుకు వచ్చిందా… తానేనండి భూమిక.

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో నటించింది. 2001లో విడుదలైన ఆ సినిమా ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఈ సినిమాలో బొడ్డు సీన్ ను ఇప్పటికీ పలు సినిమాల్లో ఇమిటేట్ చేస్తూనే ఉన్నారు. ఖుషీ సినిమాలోని పాటలు ఇప్పటికి పవన్ ఫ్యాన్సుకు ఫేవరేటే. మహేష్ బాబు కెరీర్ నే కీలక మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు.

ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ ని కొట్టే సీన్ ఇప్పటికి అంత తర్వగా ఎవరూ మర్చిపోరు. 2003 లో వచ్చి మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు సరసన భూమికనే నటించింది. అంతేకాకుండా సింహాద్రి.. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపేసిన సినిమా. ఈ చిత్రంతో ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా దర్శకత్వం వహించిన రాజమౌళికి సినిమాకు (Heroine) తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. విశేషమేమిటంటే.. 2003 లోనే ఈ సినిమా విడుదలైంది. దీంట్లో కూడా భూమికే హీరోయిన్. ఈ సినిమాతో జూ ఎన్టీఆర్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. ఈ ముగ్గురు స్టార్స్ కెరీర్ ని మార్చేసిన సినిమాల్లో భూమిక ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం భూమిక పెళ్లి చేసుకున్న భూమిక.. తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus