Bindu Madhavi: కావాలనే బిందు గేమ్ అలా ఆడిందా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది బిందుమాధవి. ఎప్పుడో ఆవకాయ్ బిర్యాని సినిమాలో ఎంట్రీ ఇచ్చి తెలుగు వారికి దగ్గరైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పెద్దగా పేరు రాలేదు. దీంతో తమిళ బిగ్ బాస్ లో అవకాశాన్ని అందుకుంది. దాదాపుగా టాప్ 5కి వెళ్తుందనుకునే టైమ్ లో అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది. అయితే, లాస్ట్ టైమ్ సీజన్ 5కి బిందు మాధవికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.

కానీ, కొన్ని కారణాల వల్ల షోకి రాలేకపోయింది. అందుకే, ఓటీటీలో ఆమెకి పెద్ద పీట వేశారు. అందరికంటే కూడా హైఎస్ట్ రెమ్యూనిరేషన్ ఇచ్చి మరీ ఓటీటీలోకి ఆహ్వానించారు. దీంతో అంచనాలకి మించి గేమ్ ఆడింది బిందుమాధవి. ఫస్ట్ వీక్ లోనే తన యాటిట్యూట్ తో హైలెట్ అయ్యింది. తేజస్వి – నటరాజ్ మాస్టర్ లతో గొడవ పెట్టుకుంది. చాలెంజర్స్ అందర్నీ తనవైపుకి తిప్పుకుంది. ఆర్జే చైతూ, యాంకర్ శివ, అనిల్ వీళ్లని తన గ్రూప్ గా పెట్టుకుంది.

రెండోవారం నుంచే అఖిల్ తో వాగ్వివాదం పెట్టుకుని నామినేట్ చేసింది. అఖిల్ తో గొడవ వల్లే నామినేషన్స్ లో హైలెట్ అయ్యింది బిందు. ఎక్కడ ఎవరికీ దొరకని లాజిక్స్ మాట్లాడుతూ సంబంధమే లేని టాపిక్స్ ని తీస్కుని వచ్చి గేమ్ ఆడింది. టాస్క్ లో పెర్ఫామన్స్ పెద్దగా లేకపోయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని ఓటీటీలో వేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. యాంకర్ శివతో కుదిరిన ఫ్రెండ్షిప్, అఖిల్ తో వైరం ఈరెండు ప్రతివారం హైలెట్ అవుతూ వచ్చాయి.

బిందు మాధవి జెర్నీలో ఇవే ప్లస్ పాయింట్స్ గా మారాయి. ముఖ్యంగా నామినేషన్స్ అప్పుడు బిందు చెప్పే మాటలు, కౌంటర్ ఎటాక్ అనేది ఆడియన్స్ కి బాగా నచ్చింది. అఖిల్ తో పెయింట్ నామినేషన్స్, బురద నామినేషన్స్ హైలెట్ అయ్యాయి. అలాగే, మిత్రా శర్మా బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ బాగా హైలెట్ అయ్యింది బిందు. ముళ్లు ముళ్లుతోనే తీయాలని మిత్రా లాగానే బిహేవ్ చేస్తూ చేసిన కౌంటర్ ఎటాక్ ఆడియన్స్ కి బాగా నచ్చింది.

ప్రతి వారం నామినేట్ అవ్వడం కూడా బిందు మాధవికి ప్లస్ అయ్యింది. వారం వారం తన ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ వచ్చింది. అఖిల్ సార్ధక్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కి ధీటుగా గేమ్ ఆడింది. ఫస్ట్ నుంచీ అన్ని సీజన్స్ ని గట్టిగా ఫాలో అయి వచ్చిన బిందు మాధవి అఖిల్ తో గొడవ పెట్టుకుంటేనే టాప్ 5కి వెళ్తామని గ్రహించి గేమ్ ఇలా ఆడిందా అనే కామెంట్స్ కూడా చాలా వినిపించాయి.

కావాలనే బిందు లాజిక్ లేకుండా పాయింట్స్ మాట్లాడుతూ అఖిల్ ని రెచ్చగొట్టిందని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ‘ఆడా’ అనే పాయింట్, అజయ్ తో ఆర్గ్యూమెంట్, నటరాజ్ మాస్టర్ తో వాగ్వివాదం, మిత్రా శర్మాకి ఇచ్చిన రీకౌంటర్ ఇవన్నీ బిందుమాధవి జెర్నీలో హైలెట్ అయ్యాయి. ఏది ఏమైనా ఇప్పుడు టైటిల్ రేసులో అఖిల్ తో పాటుగా పోటీ పడుతోంది బిందు. మరి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 కిరీటం ఈ అమ్మడుకి వస్తుందో లేదో చూడాలి. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus