Allu Arjun: బన్నీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. పుష్ప ది రూల్ ఫస్ట్ పార్ట్ ను మించి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ బడ్జెట్ కూడా భారీ మొత్తమనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సక్సెస్ తో అటు బన్నీ ఇటు సుకుమార్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు క్రేజ్ ను పెంచుకున్నారు.

డిసెంబర్ నెల 16వ తేదీన అవతార్2 మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్లలో పుష్ప మూవీ టీజర్ గ్లింప్స్ ను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. 25 భాషలలో ఈ టీజర్ గ్లింప్స్ రిలీజ్ కానుందని ఒక విధంగా ఇది కూడా రికార్డ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ గ్లింప్స్ కు సంబంధించిన షూట్ జరుగుతోందని సమాచారం అందుతోంది.

పుష్ప2 సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని తెలుస్తోంది. టీజర్ గ్లింప్ల్స్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 2023 దసరా కానుకగా పుష్ప2 రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికోత్త రికార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమాపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఊహించని ట్విస్టులతో పుష్ప ది రూల్ ఉండనుందని బోగట్టా. రష్మిక, అనసూయ పాత్రలకు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే మరింత ఎక్కువగా ప్రాదాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus