మార్చి 11న విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను రూపొందించారు. కశ్మీర్ లో 90వ దశకంలో హిందూ పండిట్ లపై జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. నిజజీవిత సంఘటనలతో ఆధారంగా సినిమాను రూపొందించడంతో ప్రతి ఒక్కరూ కథకు కనెక్ట్ అవుతున్నారు. చాలా మంది ఈ సినిమాను థియేటర్లో చూసి ఎమోషనల్ అవుతున్నారు.
మౌత్ టాక్ తో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలిరోజు మూడు కోట్లకు అటుఇటుగా ఈ సినిమా కలెక్షన్స్ ను వసూలు చేసింది. అలాంటిది వారం పూర్తయ్యేసరికి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ప్రతి ఏరియాలో ఈ సినిమాకి స్క్రీన్స్ ను పెంచుతున్నారు. షోలు పెరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. నార్త్ లో ఈ సినిమా సత్తా చాటుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ సౌత్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది.
హైదరాబాద్ లాంటి సిటీల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడుతున్నాయి. గతవారం భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను వీకెండ్ లో ఉత్తరాదిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో రీప్లేస్ చేశారు. ఇప్పుడు దేశమంతటా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘రాధేశ్యామ్’ను తీసేసి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఆడించే పరిస్థితి కనిపిస్తోంది. చిత్రబృందం పెద్దగా పబ్లిసిటీ కూడా చేసుకోవడం లేదు. జనాలే ఈ సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
హిందువుల మీద ముస్లింలు జరిపిన హత్యాకాండను కళ్లకు కట్టినట్లుగా చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. చాలా మంది ఆయన్ను పొగుడుతున్నారు. అలానే తిట్టేవాళ్లు కూడా లేకపోలేదు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!