Rajiv Chilaka: ‘ఆ ఒక్కటికీ అడక్కు’ నిర్మాత బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) అనే సినిమా రూపొందుతుంది. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) బ్యూటీ ఫారియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మధ్యనే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఇవి చూస్తుంటే రొటీన్ స్టోరీతోనే సినిమా రూపొందినట్లు అనిపిస్తుంది. కానీ కామెడీ మూవీ కాబట్టి.. టార్గెటెడ్ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరించే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉండగా..’ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రాన్ని ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు.

ఈ నిర్మాతకి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ.. ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు. పైగా ప్రభాస్ (Prabhas) ‘కల్కి’ (Kalki 2898 AD) సినిమాతో ఈయనకి ఉన్న కనెక్షన్ చాలా మందికి తెలియకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. రాజీవ్ చిలక కి ఓ యానిమేషన్ కంపెనీ ఉంది. ‘చోటా భీమ్’ వంటి కార్టూన్ వీడియోస్ అన్నీ ఇతని కంపెనీలో రూపొందినవే. అంతేకాదు.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమాకి కూడా రాజీవ్ టీం పనిచేస్తుందట.

అయితే ఈయన టీం పనిచేస్తుంది.. సినిమాకి కాదు. ‘కల్కి’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాలోని పాత్రలని పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేయబోతున్నారట. దానిని రెడీ చేస్తుంది రాజీవ్ కంపెనీకి చెందిన టీం అని తెలుస్తుంది. అయితే ‘ఈ విషయం గురించి ‘కల్కి’ యూనిట్ స్పందిస్తేనే బెటర్’ అని రాజీవ్ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus