2023 సంక్రాంతి కానుకగా రిలీజై హిట్టైన సినిమాలలో వీరసింహారెడ్డి ఒకటి కాగా కమర్షియల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ కు పరిటాల రవి కారణమని తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రతి దర్శకుడు తన జీవితంలో వేర్వేరు సందర్భాల్లో విన్న ఘటనల ఆధారంగా సినిమా కథలను సిద్ధం చేసుకుంటారు. గోపీచంద్ మలినేని కూడా పరిటాల రవి గురించి విన్న,
చూసిన, తెలిసిన, తెలుసుకున్న విషయాల ఆధారంగా వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ వీరసింహారెడ్డి ఇంటర్వెల్ సీన్ కు పరిటాల రవి రియల్ లైఫ్ లో జరిగిన ఘటన స్పూర్తి అని తెలిపారు. పరిటాల రవి చనిపోయే సమయానికి ఆయన అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదని అక్కడికి వెళ్లి ఉంటే ఆయన చనిపోయేవారు కాదని చాలామంది భావిస్తారని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.
పరిటాల రవి నేచర్ కు అనుగుణంగా వీరసింహారెడ్డి సినిమాలోని సీన్లు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయిలో కాకపోయినా కొన్ని సన్నివేశాలకు సంబంధించి పరిటాల రవి జీవితం వీరసింహారెడ్డి సినిమాలో కనిపిస్తుంది. మరోవైపు గోపీచంద్ మలినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరో ఎవరనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
మరో దర్శకుడు బాబీ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ ఇద్దరు డైరెక్టర్లకు రవితేజ మాత్రమే ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారని తెలుస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వేగంగా వరుస సినిమాలలో నటిస్తున్నారు. రవితేజ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయలు కాగా ఏడాదికి మూడు సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?