Rajamouli,Gautham Raju: రాజమౌళి… జక్కన్న గా మారడానికి కారణం ఆయనేనట.?

సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో 850 చిత్రాలకు పైగా పనిచేశారు గౌతంరాజు. అలాంటి వ్యక్తి మరణం నిజంగా టాలీవుడ్ కు పెద్ద లోటనే చెప్పుకోవాలి. అయితే అప్పటి నుంచి గౌతంరాజు గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి- గౌతంరాజు మధ్య అనుబంధం బయటపడింది. నిజానికి రాజమౌళి అనగానే కే . రాఘవేంద్రరావు శిష్యుడనే అంతా అనుకుంటారు.

కానీ ఆయన దగ్గర కంటే ముందే 24 క్రాఫ్ట్స్‌పై పట్టు పెంచుకునేందుకు జక్కన్న తీవ్రంగా శ్రమించారు. అలా ఎడిటింగ్ విషయంలో గౌతంరాజు వద్ద మెళకువలు నేర్చుకున్నారు రాజమౌళి. ఒక సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్, సూపర్ స్టార్లు, అద్భుతమైన పాటలు వున్నప్పటికీ.. సరైన ఎడిటర్ లేకపోతే సినిమా ఆదరణకు నోచుకోదని విషయాన్ని అప్పుడే పసిగట్టారు జక్కన్న. అలా గౌతంరాజు వద్ద ఎడిటర్ సినిమాను ఎలా కట్ చేస్తాడు అనే విషయాలను నేర్చుకున్నాడు.

అలా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో రాజమౌళి దర్శకుడిగా మారారు. తన తొలి సినిమా నుంచి బాహుబలి 1 వరకు కోటగిరి వెంకటేశ్వరరావునే ఎడిటర్ గా కొనసాగించారు జక్కన్న. బాహుబలి 2కి మాత్రం కోటగిరితో పాటు తమ్మిరాజుకు కూడా ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు మాత్రం శ్రీకర్ ప్రసాద్ ను ఎడిటర్ గా తీసుకున్నారు రాజమౌళి.

అయితే సుదీర్ఘ కెరీర్ లో తన గురువు గౌతంరాజుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదనే డౌట్ మీకు రావొచ్చు. ఇందుకు విమర్శకులకు అవకాశం ఇవ్వకుండా రాజమౌళియే ఒక సందర్భంలో ఆన్సర్ ఇచ్చారు. గురువును ఎడిటర్ గా పెట్టుకుంటే దర్శకుడి హోదాలో అజమాయిషీ చేయాల్సి వస్తుంది. ఈ కారణం చేతనే గౌతంరాజుతో పనిచేయలేదని జక్కన్న స్పష్టం చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus