యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు దాదాపుగా 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. 2018 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అరవింద సమేత షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది. ఎన్టీఆర్ కు, త్రివిక్రమ్ కు మధ్య గ్యాప్ వచ్చిందని అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోలేదని వేర్వేరు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిందని చెప్పినా ఆ వార్తలను తారక్ అభిమానులు కానీ త్రివిక్రమ్ అభిమానులు కానీ నమ్మలేదు.
అయితే ఎన్టీఆర్ అతి త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను మరో మెట్టు పైకి ఎక్కించే విధంగా సినిమాను తెరకెక్కించే దర్శకులలో ఒకరని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. సుకుమార్ పై కూడా తారక్ దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న తారక్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగే విధంగా ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు కొరటాల శివ సినిమా కోసం తారక్ 8 కిలోల బరువు తగ్గుతున్నారని తెలుస్తోంది. కొరటాల శివ సినిమాలో తారక్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?