ఈ మధ్యనే ‘సలార్’ (Salaar) నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ (Prabhas) గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘ ‘సలార్’ టైంలో ప్రభాస్ తో బాగా క్లోజ్ అయినట్టు, ఆ తర్వాత అతని రూమ్ నిండా సరిపడే ఫుడ్ ప్రభాస్ పంపినట్టు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. అలాగే ‘ప్రభాస్ తాను ఒక స్టార్ అనే ఇమేజ్ ను కూడా పక్కన పెట్టేస్తాడని,చాలా సింపుల్ గా ఉంటాడని, పబ్లిక్ లో ఎక్కువగా ఉండటానికి కూడా ఇష్టపడదని, ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాడని’ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ యాక్టివ్ గా ఉండడని, ఇన్స్టాగ్రామ్లో వచ్చే పోస్టులు ప్రభాస్ పెట్టినవి కాదు’ అంటూ పెద్ద చర్చకు తెరలేపాడు పృథ్వీరాజ్. మరి ప్రభాస్ ఆ పోస్టులు పెట్టుకుంటే.. ఇక ఎవరు పెడతారు? అనే డౌట్ అందరిలో ఉంది. తన ఫ్రెండ్స్ సినిమాలకి ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ లో రూపొందే సినిమాలకి ప్రభాస్ ‘బెస్ట్ విషెస్’ చెబుతూ పోస్టులు పెడుతుంటాడు. అయితే అవి ప్రభాస్ పెట్టడని..
పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ ను బట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ప్రభాస్ అనఫీషియల్ గా ఒక డిజిటల్ మీడియా సంస్థని కూడా మెయింటైన్ చేస్తున్నాడని అంటున్నారు. అది కూడా ప్రభాస్ ఫ్రెండ్స్ అలాగే అతని ఊరికి చెందిన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారట. ప్రభాస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాతో పాటు.. అతని సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ వాళ్ళే చూసుకుంటారట.
‘భవిష్యత్తు అంతా డిజిటల్’ అని అంతా అంటుంటారు. కానీ ‘ఇప్పుడంతా నడిచేది డిజిటల్ పైనే’ అనేది ప్రభాస్ నమ్మకమట. అందుకే దీనిపై కూడా అతను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభాస్ మాత్రమే కాదు మిగిలిన స్టార్ హీరోలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలు ఎక్కువగా వాడరు. వాటిని మెయింటైన్ చేయడానికి కూడా టీంలు ఉంటాయని సమాచారం.