Thandel Movie: నాగ చైతన్య కొత్త సినిమా టైటిల్ కి అర్ధం ఏంటో తెలుసా

నాగ చైతన్య – చందూ మొండేటి కాంబినేషన్లో ‘ప్రేమమ్’ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. అటు తర్వాత ‘సవ్య సాచి’ కూడా వచ్చింది. అది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘తండేల్’ రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రేపు నాగ చైతన్య పుట్టిన రోజు కావడంతో ‘తండేల్’ ఫస్ట్ లుక్ ను కూడా వదిలారు.

గుబురు గడ్డంతో, కండలు తిరిగిన దేహంతో నాగ చైతన్య … మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అతని అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉంది అని చెప్పాలి. అయితే ‘తండేల్’ అనే టైటిల్ పై ఇప్పుడు కాస్త ఎక్కువ డిస్కషనే నడుస్తుంది. దీనికి రకరకాల మీనింగులు ఉన్నాయని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. కొంతమంది తండేల్ అంటే అది ఒక జాలరి పేరు అయ్యుంటుంది అని, ఇంకొంతమంది ‘తండేల్’ అంటే సొర చేప అనే అర్థం వస్తుందని అంటున్నారు.

కానీ ‘తండేల్’ (Thandel Movie) అంటే నాయకుడు, కెప్టెన్ అనే అర్థం వస్తుంది అని దర్శకుడు చందూ మొండేటి చెప్పినట్లు సమాచారం. ‘సవ్య సాచి’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్లే ఎక్కువగా నడిచాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘తండేల్’, నాగ చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది అని తెలుస్తుంది. నాగ చైతన్య అభిమానులకి కావలసిన మంచి మాస్ హిట్.. ‘తండేల్’ రూపంలో దొరుకుతుంది అని వారు భావిస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus