పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’ అన్‌స్టాపబుల్ షోలో తన కెరీర్‌లో జరిగిన పరిణామాల గురించి విశేషాలు పంచుకున్నాడు. అందులో 2018లో విడుదలైన ‘నా పేరు సూర్య’ సినిమా ఫ్లాప్ తాలూకు ప్రభావంపై కూడా స్పష్టంగా చెప్పాడు. బన్నీ మాట్లాడుతూ, ఆ సినిమాపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ, ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ పరాజయం ఆలోచింపజేసిందని అన్నారు.
“ఆ ఫ్లాప్ తరువాత నేను ఆరు నెలల వరకు గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో నాకు ఒక విషయం స్పష్టమైంది. మనం ఎదగాలంటే మన లోపాలను అంగీకరించాలి, మారాలి. ఎవరైనా నాలో నెగెటివ్ పాయింట్స్ చెబితే నేను వినేవాడిని కానీ మైండ్‌లోకి తీసుకోలేదు. ఆ సమయంలో నేను నెగెటివ్‌నే స్వీకరించడం మొదలుపెట్టా,” అని బన్నీ చెప్పాడు. జీవితంలో మరో కీలక మార్పు, అలవాట్లు మార్చుకోవాలి. షూటింగ్స్ ఉన్నప్పుడు తాను ప్రొఫెషనల్‌గా ఉదయాన్నే లేచే అలవాటు ఉండేదని, కానీ షూటింగ్స్ లేని రోజులలో కూడా అదే నియమాన్ని కొనసాగించాలని అనుకున్నానని తెలిపాడు.
“ఉదయం 4-5 గంటల మధ్య లేవడం అలవాటు చేయాలి. ఇది నా జీవితం కోసం మార్పు చేయవలసిన పెద్ద అంశం,” అని బన్నీ వెల్లడించాడు. ‘నా పేరు సూర్య’ తరువాత బన్నీ తన కెరీర్‌లో గేమ్‌చేంజింగ్ నిర్ణయాలు తీసుకున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తరువాత కొంత కాలం సైలెంట్‌గా ఉంటూ, తన తర్వాతి ప్రాజెక్ట్‌ను మెరుగైన కంటెంట్‌తో ఎంచుకోవాలనుకున్నాడు.
ఆ విధంగానే ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా సక్సెస్‌తో పవర్‌ఫుల్ కమర్షియల్ హీరోగా బన్నీ తిరిగి వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఒక కొత్త పాపులారిటీని సాధించిన బన్నీ, తన గత ఫ్లాపులను లైఫ్ లెసున్లుగా మలచుకున్న తీరుకు అందరూ ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో మరింతగా ఎదిగేందుకు సిద్ధమైన బన్నీ, తన ప్రతిభను కొత్త కోణంలో చూపించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్నాడు.